విశాల ఐక్య సంఘటన కావాలి!
![]()
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంటులో బిల్లు పెట్టాలనే డిమాండుతో ప్రజా గాయకుడు గద్దర్ వరంగల్, హనుమకొండ, కాజీపేటలలో డిసెంబర్ 11 నుంచి 15 వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో ఆ మూడు పట్టణాల్లో ప్రతి గడప తొక్కి ప్రతి ఇంటిలో పౌరుల కడుపులో తలపెట్టి తన ఈ డిమాండుకు సంఘీభావం ప్రకటించాలని కోరారు. ఈ విషయాన్ని పాదయాత్ర ప్రారంభించడానికి ముందుగానే రాజధాని నగరంలో, వరంగల్‌లో, పలుచోట్ల చెప్పాడు. మీడియాలో విస్తృత ప్రచారాన్ని పొందింది. గద్దర్ వరంగల్ నగరంలో కాలు మోపితే చంపేస్తామని, ఆయన పాదం మోపే నేలకింద మందుపాతరలు పెట్టి పేల్చివేస్తామని బ్లూ టైగర్స్ పేరుతో ఒక మీడియా ప్రకటన వచ్చింది.
0 comments Tuesday 16 Dec 2008 | వరవరరావు | వ్యాసాలు, తెలుగు, AndhraJyothy
తిరుపతిలో వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, పద్మావతి విశ్వవిద్యాలయం పెట్టినప్పుడు కరీంనగర్ విశ్వవిద్యాలయం శ్రీరాజరాజేశ్వరీ విశ్వ విద్యాలయం ఎందుకుకాకూడదు? సమ్మక్క సారలక్క విశ్వవిద్యాలయం ఎందుకు కాకూడదు?
పెద్దపల్లి, న్యూస్‌టుడే: ప్రజల కోసం అజ్ఞాతంలో ఉంటున్న మావోయిస్టులను ప్రభుత్వం దొంగచాటుగా పట్టుకొచ్చి కాలుస్తోందని విరసం నేత పెండ్యాల వరవరరావు ఆరోపించారు. ఆదివారం కరీంనగర్ జిల్లా ఓదెల మండలం గూడెంలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సందె రాజమౌళి అలియాస్ ప్రసాద్ అంత్యక్రియలకు వరవరరావు హాజరయ్యారు. ప్రజలకు సేవలు అందించలేని ప్రభుత్వం మావోయిస్టు పెద్ద తలలకు వెల కడుతోందన్నారు.