భేతాళ శవం

లాకప్‌లోని శవాన్ని భుజంమీదేసుకొని
నడుస్తున్నాను
నా మరణోదంతం చెప్తాను
సహజ మరణమో హత్యో చెప్పమన్నది శవం

శవం – అందులోనూ లాకప్‌లో
మాట్లాడిందంటేనే
అది హత్యే అయ్యుంటుందన్నాను

సత్యం చెప్పినందుకు సంతోషించినా
బతికున్నవాడు నోరువిప్పడం నేరం గనుక
శవం మాయమయింది
మరో లాకప్‌లో తేలింది.

27/28-9-86

పేజీ పైకి